మూటకొండూర్ మండలం కదిరేణిగూడెంలో మంగళవారం టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. ఇందులో గ్రామ శాఖ అధ్యక్షునిగా పాశం స్వామి, ప్రధాన కార్యదర్శిగా పన్నాల వెంకట్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇన్ ఛార్జ్ నాగిరెడ్డి, సర్పంచ్ వేముల పాండు తదితరులు పాల్గొన్నారు.