పాఠశాలకు ఫ్యాన్లను బహుకరించిన వార్డు మెంబర్

324చూసినవారు
పాఠశాలకు ఫ్యాన్లను బహుకరించిన వార్డు మెంబర్
బొమ్మలరామారం మండలం సోలిపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు 6వ వార్డు సభ్యుడు కొక్కొండ నరేందర్ రెడ్డి మంగళవారం రెండు ఫ్యాన్లను అందించారు. ఈ సందర్భంగా పాఠశాలకు తన వంతుగా రూ.3500 విలువ చేసే ఫ్యాన్లను అందజేసిన నరేందర్ ను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది రమేష్, యూత్ నాయకులు మొలుగు బాలరాజ్, దుర్గ నగర్ రాజేష్ గౌడ్, ధీరవత్ మోహన్ నాయక్, సందగళ్ల రాజు, చిట్టమ్మ, అండాలు, నర్సయ్య, లచమ్మ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్