Oct 27, 2024, 09:10 IST/
దీపావళి పండుగ వెనుక ఉన్న కథ ఇదే
Oct 27, 2024, 09:10 IST
అయోధ్య మహరాజు దశరథుడి కోరిక మేరకు శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం వెళ్తాడు. శ్రీరాముడు, సీత వనవాస కాలంలో ఉన్నప్పుడు రావణుడు.. సీతను అపహరిస్తాడు. ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు, రావణుడిని సంహరిస్తాడు. అనంతరం శ్రీరాముడు వనవాసం పూర్తి చేసుకుని సతీసమేతంగా అయోధ్యకు చేరుకుంటాడు. ఆ రోజు అమావాస్య కావడంతో రాజ్య ప్రజలంతా ఆయనకు దీపాలు పట్టుకుని స్వాగతం పలుకుతారు. నాటి నుంచి దీపావళి పండుగ జరుపుకుంటున్నారని రామాయణం ద్వారా తెలుస్తోంది.