చేనేత కార్మికుడు మృతి
చౌటుప్పల్ మండలంలోని నేలపట్ల గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు శ్రీరాముల రమేష్ (64) అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. చేతినిండా పని లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ రమేష్ అనారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన చికిత్స కోసం ఆర్థిక స్తోమత లేక చేనేత కార్మికుడు ప్రాణాలను విడిచి పెట్టాడు. మృతుడికి నలుగురు ఆడపిల్లలు. వారే ముందు నడిచి తండ్రికి దహన సంస్కారాలు నిర్వహించారు.