రైతు భూమి పై దౌర్జన్యంగా దాడి (వీడియో)
చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామానికి చెందిన రైతు తొర్పునూరి జంగయ్య భూమి పై బాట కొరకు వివాదం చేస్తూ చింతపల్లి కోటిరెడ్డి, శంకర్ రెడ్డి దాడి చేశారు. బుధవారం ఉదయం బావి వద్ద ఎవరూ లేని సమయంలో వచ్చి పొలంలోని చెట్లను నరికేసి దారి చేశారు. ఈ భూ వివాదం 3 ఏళ్లుగా నడుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఎమ్మార్వో పంచనామా సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. కానీ ఇతర రైతులు ఒప్పుకోకపోవడంతో జంగయ్య ఎకరం భూమి కోల్పోవాల్సి వస్తుంది. రెవెన్యూ అధికారులు ఇప్పటికైనా స్పందించి భూవివాదాన్ని పరిష్కరించి, తనను కాపాడాలని వేడుకుంటున్నాడు.