రాజీ మార్గమే.. రాజమార్గం: చందంపేట ఎస్సై బి. యాదయ్య

3520చూసినవారు
రాజీ మార్గమే.. రాజమార్గం: చందంపేట ఎస్సై బి. యాదయ్య
కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదికని, కక్షిదారులకు డబ్బు, సమయం కూడా ఆదా అవుతుందని చందంపేట ఎస్సై బి. యాదయ్య పేర్కొన్నారు. ఈ నెల జూన్ 26వ తేదీ వరకు దేవరకొండ కోర్టు లో నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కక్షి దారులను ఆయన కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో నిబంధనలకు వ్యతిరేకంగా మాస్కులు లేకుండా సంచరించిన వ్యక్తులపై కేసులు, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన కేసులు, మద్యం సేవించి వాహనం నడిపిన కేసులు (పెటి కేసులు) చలానా చెల్లించుకుని పరిష్కరించుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్ లో పరిష్కారం అయిన కేసులు తిరిగి మరో కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం లేదన్నారు. లోక్ అదాలత్ ద్వారా కేసులు సత్వర పరిష్కారం అవుతాయనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు న్యాయవాదులు, లీగల్ సర్వీస్ కమిటీ సభ్యులు మరింత కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్