కొండమల్లేపల్లి అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎంను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రామ్మూర్తి తెలిపిన ప్రకారం చౌరస్తాలో తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా డీసీఎంలో సుమారు 70 ఆవు దూడలను ఏలూరు జిల్లా నుండి తుక్కు గూడకు తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసి, ఆవు దూడలను గోశాలకు తరలించినట్టు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది జగన్ నాయక్, వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.