దేవరకొండ: విద్యుత్ ఏఈకి వినతిపత్రం అందజేత

77చూసినవారు
దేవరకొండ: విద్యుత్ ఏఈకి వినతిపత్రం అందజేత
దేవరకొండ పట్టణ శివారులోని డబల్ బెడ్రూం ఇళ్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం బీజేపీ ఆధ్వర్యంలో కరెంటు ఏఈకి వినతిపత్రం అందజేశారు. డబల్ బెడ్రూం ఇండ్లు పూర్తయి మూడేళ్లు కావస్తున్న ఇప్పటివరకు కరెంటు మీటర్లు, రోడ్లు, మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీజేపీ నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ యాదవ్, భాస్కర్, శేఖర్, రమేష్, డబల్ బెడ్రూం లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.