దేవరకొండ: రాష్ట్రంలోని గురుకులాలు ఇతర పాఠశాలల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక పథకం ప్రకారం ప్రభుత్వంపై విషం చిమ్మే కుట్ర కోణం దాగుందని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో కేసీఆర్, కేటీఆర్ ఆలోచన విధానం మేరకే ఈ ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్న ఈ ఘటనలపై సీఎం సమగ్ర విచారణ జరిపించాలన్నారు.