చందంపేట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టాలని మండల అధ్యక్షుడు కేతావత్ లక్ష్మ నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ జెండా కార్యక్రమాన్ని పండుగా నిర్వహించుకుంటున్న సందర్భంగా ప్రతి తండా గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ దిమ్మె మీద పార్టీ జెండా ఎగరించాలని ఆయన పిలుపునిచ్చారు.