దేవరకొండ మండలం కొండ బీనపల్లి గ్రామ పరిధిలో మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి 17వ తేది అదృశ్యమైన పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థుల ఆచూకీ బుధవారం రాత్రి తెలిసినది. అయితే వారిని ఇబ్రహీంపట్నం దగ్గర కనుగొని రాత్రి దేవరకొండ పోలీస్ స్టేషన్ కు తరలించి గురువారం ఉదయం మీడియా మిత్రుల సమక్షంలో డిఎస్పి గిరిబాబు, సిఐ నరసింహులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థుల తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది.