రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది చాలి చాలని కూలీ డబ్బులతో జీవనం సాగిస్తున్న ఆ ఇంట్లో ఇంతలోనే విషాదం.. సంవత్సరం క్రితం తల్లి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. తరువాత కరోనా సెకండ్ వేవ్ లో మూడు నెలల క్రితం ఇంటికి పెద్దదిక్కైన తండ్రి కరోనాతో కొట్టుమిట్టాడుతూ చనిపోయారు.
ఈ సంఘటన గ్రామాన్ని కలిచివేసింది. ముందు తల్లి తర్వాత తండ్రి మృతి చెందడం.. వీరి కుటుంబానికి పెద్ద దిక్కు చూసుకునేవారు లేకుండా పోయింది. చందంపేట మండలం చిత్రీయల గ్రామానికి చెందిన రాములు, కృష్ణ వేణి. కలిసి కులాంతర ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇరువురి జీవితం 20 ఏళ్ళు జీవితం సజావుగా సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మేఘన (14), కావేరి (13) ఈ కుటుంబం కూలీ పని చేసుకుంటూ ఇద్దరు అమ్మాయిలను చదివిస్తూ.. కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. కానీ కిరోసిన్ పోసుకుని తల్లి, కరోనా వ్యాధితో తండ్రి చనిపోవడంతో వారు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. నాడు తల్లి, ఇప్పుడు తండ్రి మరణించడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మిగిలారు. కనీసం వ్యవసాయ భూమి కూడా లేదు. పూరి గుడిసె లొనే జీవనాన్నీ వెళ్లదీసుకుంటున్నారు. వర్షం వస్తే గుడిసె మొత్తం కారుతుంది. వీరు చేసిన ఆర్తనాదాలతో గ్రామం కన్నీటి పర్యంతమైంది. ఈ హృదయ విచారక సంఘటన చందంపేట మండలం చిత్రీయల గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాకు దిక్కెవరు అని బోరున విలపిస్తున్నారు
తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయాం మాకు చూసుకునే పెద్దదిక్కు లేరు రోజు కూలీ పనికి మా అక్క నేను వెళ్తాన్నాం. పనికి వెళ్ళకుంటే పూట గడవదు. బతుకు భారం అయ్యింది. ఈ వయస్సులో మేము చూదువుకోవాల్సిన సమయంలో కష్టాలు ఎదుర్కొంటున్నాం. కనీసం మాకు వ్యవసాయ భూమి లేదు ఉన్నది ఒక పూరి గుడిసె మాత్రమే బాగా వర్షం కురిస్తే అదికూడా కారుతుంది. ప్రభుత్వ పరంగా దాతల సహకారంతో మమ్మల్ని ఆదుకోండి సారూ అంటూ వేడుకుంటాన్నారు.