ముగ్గురమ్మల మూలపుటమ్మగా అమ్మవారి దివ్య దర్శనం
కనగల్ మండలం ధర్వేశిపురం పర్వతగిరి గ్రామ శివారులో గల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయంలో బుధవారం ముగ్గురమ్మల మూలపుటమ్మను దివ్యదర్శనం చేసుకుని భక్తులు తరించారు. నిత్య అభిషేకం, లలిత సహస్ర నామార్చన, మహా మంగళ హారతి గావించారు. మహిళ భక్తులు విశేషంగా కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచార్యులు ఆచార్యత్వంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తులకు అమ్మవారి ఆశీస్సులు అందించారు.