ద్విచక్ర వాహనం దగ్ధం
కనగల్ మండల పరిధిలోని ఇస్లాం నగర్ లో శుక్రవారం ఓ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎస్కే బాబా రోజు మాదిరిగానే తన ద్విచక్ర వాహనాన్ని ఇంట్లో పార్కింగ్ చేసి కూలి పనికి భార్యతో కలిసి వెళ్లాడు. ఉదయం 11:00 గంటల సమయంలో ఇంట్లో బైక్ దహనం అవుతుండడంతో చుట్టుపక్కల వారు గమనించి బాబాకు సమాచారం అందించారు. అతడు వచ్చేసరికి అప్పటికే బైక్ పూర్తిగా కాలిపోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ నరసింహారెడ్డి ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.