పద్మమోహన అవార్డు అందుకున్న భిక్షవమ్మ
నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం కేశవపురం గ్రామంకి చెందిన కొండేటి భిక్షవమ్మ బుధవారం హైదరాబాద్ లో జరిగిన పద్మమోహన బుల్లి తెర అవార్డులో భాగంగా 2024 సంవత్సరానికి గాను బెస్ట్ సింగర్ అవార్డును అందుకోవడం జరిగింది. ఆమె మాట్లాడుతూ, పాటలు పాడడానికి అవకాశం ఇచ్చి, నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ప్రేమ పూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను అన్నారు.