నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం నీలం నగర్ సమీపంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం పత్తి రైతుల ధర్నా నిర్వహించారు. పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. రైతులకు మద్దతుగా వచ్చిన వ్యక్తిని ఓ కానిస్టేబుల్ దుర్భాషలాడాడు. పరుష పదజాలాన్ని వాడడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.