తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమ బాగా వృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. చిత్రపురిలో కొత్తగా కట్టే ఫ్లాట్లలో తెలంగాణ వారికే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమ కేవలం ఐదారుగురు పెద్దలదే కాదన్నారు. తెలంగాణ వాళ్లు ఎన్నో గొప్ప సినిమాలు తీశారని.. మాభూమి నుంచి బలగం వరకు ఎన్నో గొప్ప చిత్రాలు తీశారన్నారు.