కుక్కడం గ్రామంలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం
మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో కేజీబీవీ బాలికల విద్యాలయంలో ఐసిడిఎస్ దామరచర్ల ప్రాజెక్టు సూపర్ వైజర్ నాగమణి, ఆధ్వర్యంలో ఘనంగా పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ చంద్రకళ, హెల్త్ సూపర్వైజర్ శాంత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ చంద్రకళ మాట్లాడుతూ కిశోర బాలికలకు పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.