Feb 26, 2025, 12:02 IST/మునుగోడు నియోజకవర్గం
మునుగోడు నియోజకవర్గం
నల్గొండ: జాతీయ హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారిణి
Feb 26, 2025, 12:02 IST
చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మర్రి కల్పన సీనియర్ జాతీయ హాకీ పోటీలకు ఎంపికైనట్లు నల్గొండ హాకీ అసోసియేషన్ అధ్యక్షులు కూతురు శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇమామ్ కరీం బుధవారం తెలిపారు. మార్చి 1 నుండి హర్యానా రాష్ట్రంలో జాతీయ స్థాయి హాకీ పోటీలో ఆమె పాల్గొననున్నారు. మర్రి యాదగిరి, యశోద దంపతుల కుమార్తె మర్రి కల్పన, చిన్నప్పటినుండి హాకీ పై మక్కువ పెంచుకొని జాతీయ పోటీలకు ఎంపికైందని వారు తెలిపారు.