ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను 100% పూర్తిగా అమలు చేసినప్పుడే బిఆర్ఎస్ పార్టీకి ప్రజల ఆదరించి మళ్ళీ అవకాశం ఇస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసిఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారని, వాటిని ఈ ఎన్నికల ముందే అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. అప్పుడే ప్రజలు నమ్మి మళ్ళీ అధికారం ఇస్తారని చెప్పారు. లక్ష రుణమాఫీ చేస్తామని చెప్పిన
కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని ఆరోపించారు.
ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, సీనియర్ నాయకులు నూకల జగదీష్ చంద్ర, రెమిడాల పరశురాములు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, వినోద్ నాయక్, ఆయూబ్ నాయకులు రొంది శ్రీనివాస్, కె. రమేష్, పాపిరెడ్డి, నంద్యాల వేణుధర్ రెడ్డి, జతంగి సైదులు, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.