నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య, ఎంపీటీసీల వీడ్కోలు సన్మాన సభలో గురువారం పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి వారికి సన్మానం చేసి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ 5 సంవత్సరాల వారి పదవి కాలంలో మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పని చేసిన వారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.