మురికి కాల్వలోకి దిగి నిరసన వ్యక్తం చేసిన కాలనీ వాసులు

1354చూసినవారు
మురికి కాల్వలోకి దిగి నిరసన వ్యక్తం చేసిన కాలనీ వాసులు
మిర్యాలగూడ పట్టణంలోని శాంతినగర్ 26వ వార్డుకు చెందిన కాలనీ వాసులు మురికి కాలువలోకి దిగి అధికారుల తీరును నిరసిస్తూ వార్డు కౌన్సిలర్ తో కలిసి కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. మురుగు నీరు పారకపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస బాధ్యతగా మున్సిపల్ అధికారులు డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డులో కాల్వలు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక మురుగు నీరంతా రోడ్డుపై ప్రవహిస్తుందన్నారు. ఇండ్ల ముందుకు మురుగునీరు చేరడంతో పందులు దోమలు స్వైరవిహారంతో రోగుల బారిన పడుతున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏడాది నుంచి ఈ సమస్య నెలకొందని ఇక్కడ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్