మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామదాసు శ్రీను ఆధ్వర్యంలో మంగళవారం వివిధ గ్రామాలలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో నేను మీకందరికీ చెక్కులను అందజేశానని అన్నారు.