బడి గుడి వంటిది: మునుగోడు ఎమ్మెల్యే

73చూసినవారు
బడి గుడి వంటిదని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం సంస్థాన్ నారాయణపూర్ మండలం సర్వేల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవన సముదాయం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18. 61 కోట్ల రూపాయల వ్యయంతో భవనాలు, 1 కోటి రూపాయల వ్యయం తో ఫర్నిచర్ తో కూడిన నూతన పాఠశాల భవన సముదాయాలను ప్రారంభించినట్లు తెలిపారు. పాఠశాలల్లో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు పాటించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.