గుర్రంపోడు మండలం ఆమలూరు గ్రామానికి చెందిన రాచమల్ల వెంకన్న ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భర్త మరణంతో భార్య రేణుక, ముగ్గురు పిల్లలు అనాదలయ్యారు. పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు వారి కుటుంబానికి మంగళవారం రూ.10 వేల రూపాయలను సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, ట్రెజరరీ పగడాల కళ్యాణ్, మొగిలి కిషన్, పందుల శ్రీను, పుప్పాల పాపయ్య పాల్గొన్నారు.