
కొప్పోల్ ఆలయ భూముల్ని పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలోని ఆలయ భూములను గురువారం దేవాదాయ శాఖ డిప్యూటీ కలెక్టర్ అనిత పరిశీలించారు. గత నెల ఆలయ భూములను సర్వే నిర్వహించి, హద్దు రాళ్ళు పాతాల్సి ఉండగా ఆగిపోవడంతో అందుకు గల కారణాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలు ముగిసిన అనంతరం రెవిన్యూ అధికారులతో మాట్లాడి వెంటనే సర్వే నిరహిస్తామని ఆమె తెలిపారు.