నల్గొండ: మహిళల శక్తి కార్యక్రమం కింద వివిధ రకాల సహకారాన్ని అందిస్తున్నాము
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకించి స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇందిరా మహిళల శక్తి కార్యక్రమం కింద వివిధ రకాల సహకారాన్ని అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం ఆమె అనుముల మండలం హాలియాలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళ శక్తి క్యాంటీన్ ను ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. గతంలో మహిళలకు 800 కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాత్రమే ఇవ్వగా, ఇప్పుడు 1500 కోట్లు ప్రభుత్వం ఇవ్వనున్నదని తెలిపారు.