వివిధ పార్టీల నుండి బీజేపీలోకి చేరికలు

1132చూసినవారు
వివిధ పార్టీల నుండి బీజేపీలోకి చేరికలు
నకిరేకల్ మండలం నోముల గ్రామంలో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి మహిళలు యువకులు 50 మంది నరేంద్ర మోడీ పాలనకు ఆకర్షితులై భాజపాలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లలో నకిరేకల్ నియోజకవర్గంలో భాజపా జెండా ఎగర వేస్తామని ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యానాల శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బుడిగె సైదులు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొండేటి శీను, మండల కోశాధికారి రాచూరి శేఖర్, మండల యువ మోర్చా అధ్యక్షుడు కొల్లూ శివ శంకర్ మరియు ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, సురేష్ రెడ్డి, ఉప్పల నాగరాజు, ఆలకుంట నరేష్, ఆకారపు జానీ, సూరారం నరేష్, చికెన్ సైదులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్