నామినీకి 5 లక్షల భీమా చెక్కు అందజేసిన ఎయిర్టెల్

4543చూసినవారు
నామినీకి 5 లక్షల భీమా చెక్కు అందజేసిన ఎయిర్టెల్
నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామానికి చెందిన ఎయిర్ టెల్ పేమెంట్స్ బ్యాంకు వినియోగదారుడు అయిన అయిటిపాముల రాము ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా నామినీ అయినటువంటి అతని తండ్రి ఐటిపాముల సత్యనారాయణకు 5 లక్షల రూపాయల భీమా చెక్కును ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అధికారులు అందజేశారు. కార్యక్రమంలో ఆ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఫణి , జోనల్ గ్రీవిన్స్ ఆఫీసర్ ప్రశాంత్, నల్లగొండ జిల్లా టీమ్ లీడర్ శ్యామల సుందర చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో ఖాతా తెరిచిన ప్రతి ఒక్కరికి 5 లక్షల ఉచిత ప్రమాద భీమా సౌకర్యం లభిస్తుంది అని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్