ఎంపీడీవో ఆఫీస్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుక

81చూసినవారు
ఎంపీడీవో ఆఫీస్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుక
చిట్యాలలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మహత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హక్కుల సాధనకై శాంతియుత పోరాట మార్గాన్ని ఆచరణలో చూపించి ప్రపంచానికి అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన గాంధీ మార్గం ఎప్పటికీ ఆదర్శప్రాయం అని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్ పి జయలక్ష్మి, ఏఇటి సత్యం, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్