కట్టంగూరు మండల కేంద్రంలో ఎంఆర్ భవనం లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్ధంతి కార్యక్రమాన్ని కేజికేఎఫ్ అధ్యక్షులు తండు నర్సింహా అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్బంగా మండల కార్యదర్శి దండేంపల్లి శ్రీను మాట్లాడుతూ, బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్నీ అందించిన భారతదేశపు తొలి గొప్ప బహుజన చక్రవర్తి సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్.మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ సమకాలీకుడైనా, రాచరికపు ప్రభువుల వైభవాన్ని తప్ప సామాన్యుడి పోరాటాన్ని చరిత్ర విస్మరిస్తుందనడానికి మన సర్వాయి పాపన్న చరిత్రే సజీవ సాక్ష్యం. మరో వైపు అతని శౌర్య పరాక్రమాలను మరి పోరాటాలను అవహేళన చేస్తూ అతనిని దోపిడీ దొంగగా కూడా చిత్రీకరించారు. కొడ్తే గోల్కొండనే కొట్టాలే అన్న కాంక్షతో బాల్యం నుంచే రగిలిపోయేవాడని, దానికి తన కుల వృత్తియైన కలాల్ వృత్తిని వదిలి సబ్భండ జాతులతో సైన్యాన్ని కూర్చుకొని 22 కోటలను కొట్టి ఏకంగా గోల్కొండపై విజయ బావుటా ఎగురవేసిన ధీశాలి పాపన్న అని తెలిపారు.ఈ కార్యక్రమం లో కేజికేఎఫ్ సంఘం అధ్యక్షులు మాద శ్రీను,మండల కమిటీ సభ్యులు గుండాల నాగేష్, వేముల సైదులు, మాద రవి,వేముల వెంకట్, సున్నం నాగరాజు, గుడుగుంట్ల రామక్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.