దేశానికి రైతు వెన్నెముక అన్నది నిజం చేసి రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం తమదేనని రాష్ట్ర రోడ్లు , భవనాలు , సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సోమవారం ఆయన నల్గొండ జిల్లా, తిప్పర్తి మండలం లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు , శంకుస్థాపన చేశారు. మండలంలోని పర్జూరులో పిఎసిఎస్ భవనానిన్నీ ప్రారంభించారు. అంతేకాక ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ ను ప్రారంభించారు.