ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

68చూసినవారు
ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పి చందనా దీప్తి ఐపీఎస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణా ఏర్పడి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వరాష్ట్రంలో జిల్లా ప్రజలకు పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా సేవలందిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.