రుణమాఫీ కాని రైతులకు అధికారుల నుంచి చిత్రవిచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. అధికారులు అడుగుతున్న డాక్యుమెంట్ల వివరాలు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో అర్థంకాని పరిస్థితి! అసలు నాకు పెండ్లే కాలేదో మహాప్రభో అంటే.. అయితే, భార్య పేరిట ఆధార్‌కార్డు తీసుకురండి అని చెప్తున్నారు. ఎప్పుడో ఆధార్ అనేది పుట్టకముందే చనిపోయినవారి విషయంలోనూ ఆధార్ నంబర్ తెచ్చి ఇవ్వాలని కోరడం మరో తమాషా. రుణమాఫీ కోసం అధికారుల వద్దకు వెళ్తే రైతులకు ఎదురైన అనుభవాలు ఇవీ.