నల్లగొండ పట్టణం ఒకటో నెంబర్ వినాయకుడి లడ్డూని వేలం పాటలో 13, 50, 000 రూపాయలకు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ లో మొదటి విగ్రహం వద్ద నల్లగొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గెలుచుకున్నారు. గత సంవత్సరం వేలం పాటలో 36 లక్షల రికార్డు ధర పలికిన లడ్డు ఈ సంవత్సరం కేవలం 13 లక్షల 50 వేలకు కోవడం గమనార్హం. గత సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్ల కారణంగా రాజకీయ నాయకులు పోటీపడి లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు.