సామాజిక, ఆర్థిక , విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి ఎవరు ఓటీపీ లేదా లింకులు అడగరని, అలాగే ప్రజలు లింకులు, ఓటీపీలు చెప్పాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఆదివారం ఆమె నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి లోని లక్ష్మీపురం, గాంధీనగర్ వీధులలో సమగ్ర కుటుంబ సర్వేను తనిఖీ చేశారు.