ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్, ఇంటర్ ఓపెన్ స్కూల్లో చేరేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్ కోఆర్డినేటర్ సీత వెంకటయ్య సెల్ నెంబర్ 9441464921ను సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలన్నారు.