రామన్నపేట: ఉరివేసుకొని బాలుడు మృతి
రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ల్లివాడ గ్రామానికి చెందిన మహంకాళి నర్సింహ్మను, కుమారుడు (15) స్మార్ట్ పోన్ అడిగాడు. దానికి తండ్రి ప్రస్తుతం డబ్బులు లేవని కొద్దిరోజులు ఆగాక ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో మనస్తాపం చెందిన బాలుడు ఇంట్లో ఎవరులేని సమయంలో చీరతో ఉరివేసుకొని మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.