రైల్వే అండర్​ పాస్​ సమస్యలని పరిష్కరించాలి:ఫిట్​ ఇండియా ఉపాధ్యక్షుడు

749చూసినవారు
రైల్వే అండర్​ పాస్​ సమస్యలని పరిష్కరించాలి:ఫిట్​ ఇండియా ఉపాధ్యక్షుడు
వర్షాకాలంలో రామన్నపేట రైల్వే అండర్​ పాస్​ వంతెన కింద నీరు నిలిచిపోయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా ఫిట్​ ఇండియా ఉపాధ్యక్షుడు తలారి గణేశ్​ తెలిపారు. మండల కేంద్రానికి వెళ్లాలంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్​ అనితా రామచంద్రన్​కు ఆయన శనివారం వినతి పత్రం అందజేశారు. మండలంలోని వెల్లంకి, సిరిపురం, సర్నేని గూడెం, సుంకెనపల్లి గ్రామాల ప్రజలకు పెద్ద సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు, ఆటోల ద్వారా ప్రయాణించే సామాన్యులకు నరకప్రాయంగా మారిందన్నారు. ఈ విషయంపై జిల్లా పాలనాధికారి సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. రైల్వే అధికారులతో మాట్లాడి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినట్లు తలారి గణేశ్​ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్