జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ
తిప్పర్తి మండలంలోని బీసీ కాలనీ, సత్తిరెడ్డి డొంక ఏరియాలలో 250 కుటుంబాలకు జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ కూరగాయలు అందజేశారు. ఈ సందర్భంగా జననీ ఫౌండేషన్ చైర్మన్ బద్దం సుధీర్ మాట్లాడుతూ.. కరోనా వల్ల ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో ప్రజలకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. ప్రజలు నిత్యావసరాల కారణంగా ఇబ్బంది పడొద్దని సరుకులు అందజేస్తున్నట్లు తెలిపారు. దయజేసి భౌతిక దూరం పాటిస్తూ, కరోనా పట్ల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని అన్నారు.