తిప్పర్తి: అనుమానాస్పద స్థితిలో బాలుడు మృతి
తిప్పర్తి మండలం ఇండ్లురు గ్రామానికి చెందిన ఏపూరి నాగరాజు(16) మేకలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు.ఆదివారం మేకలు మేపడానికి గ్రామ శివారులోకి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా గ్రామంలోని పురాతన చర్చిలో నాగరాజు మృతదేహం కనపడింది. నోట్లో నుండి నురగలు రావడంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.