Sep 17, 2024, 11:09 IST/
గంజాయిని విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
Sep 17, 2024, 11:09 IST
భువనగిరిలో గంజాయిని విక్రయిస్తున్న పశ్చిమబెంగాల్ కు చెందిన జహీరూల్ అనే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలోని జమానాగూడ కాలనీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ గంజాయిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వ్యక్తిని అదుపులోకి తీసుకొని 100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించినట్లు మంగళవారం సిఐ రాధాకృష్ణ పేర్కొన్నారు.