తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నూతన వధూవరులకు కీలక విజ్ఞప్తి చేశారు. తమిళనాడుపై హిందీని రుద్దేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని, ఈ పరిస్థితుల్లో యువ జంటలు తమకు పుట్టబోయే పిల్లలకు తమిళంలోనే పేరు పెట్టాలని కోరారు. నూతన వధూవరులు తమ పిల్లలకు తమిళ పేర్లు పెట్టి హిందీని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర గీతంలో ‘ద్రావిడ’ పదాన్ని తొలగించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.