ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ తో ప్రతి ఏటా15 లక్షల మంది మరణిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాల్లో 2009 నుంచి 2019 మధ్య ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇందుకోసం గాలిలో పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 కాలుష్య కారణంగా ఏటా నమోదైన మరణాలను ప్రామాణికంగా తీసుకున్నారు. పదేళ్ల కాలంలో జిల్లాస్థాయిలో నమోదైన మరణాలు, కాలుష్యంపై ఉపగ్రహ సమాచారం, క్షేత్రస్థాయి పర్యవేక్షణ కేంద్రాల నుంచి వివరాలను తీసుకుని ఈ అధ్యయనం చేశారు.