హౌరా నుంచి ఢిల్లీకి వెళ్లే పూర్వ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏసీ బోగీలు కూడా జనరల్ బోగీలుగా మారుతున్నాయని ఓ ప్రయాణికుడు రైల్వే అధికారులకు ఆన్‌లైన్ ద్వారా కంప్లైంట్ ఇచ్చాడు. సరైన వెరిఫికేషన్ చేయకుండానే సమస్యను పరిష్కరించినట్లుగా అధికారులు తన కంప్లైంట్‌ను క్లోజ్ చేశారని ప్రయాణికుడు వాపోయాడు. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. రైల్వేలో అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని అన్నాడు.