హీరోయిన్‌తో నారా రోహిత్ నిశ్చితార్థం!

84చూసినవారు
హీరోయిన్‌తో నారా రోహిత్ నిశ్చితార్థం!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 13న హైదరాబాద్‌లో ఆయన నిశ్చితార్థం చేసుకోనున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నారు. ఇటీవల నారా రోహిత్ ప్రతినిధి-2 సినిమాలో నటించారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ పెళ్లి చేసుకోబోతున్నాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్