పల్లెల్లో గ్రామపంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. నర్వ మండల పరిధిలోని ఆయా గ్రామాలలో నీవా నేనా అన్నట్టుగా గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నడుస్తుంది. అయితే గత ఎన్నికలలో లక్కర్ దొడ్డి గ్రామం ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. ఈ గ్రామంలో మొత్తం ఓటర్ల సంఖ్య 370. అందులో పురుషులు 200, మహిళలు 170 మంది ఓటర్ జాబితాలో నమోదు కాబడ్డాయి. మరి ఓటర్లు ఏకగ్రీవమా? ఎన్నికలా? అనే విషయం తెలియాల్సి ఉంది.