అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు నిర్విరామంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ ప్రచారపర్వంతో అలసిపోతున్నారట. దీంతో తాను నిద్రపోవడానికి మరింత సమయం కావాలని, రాత్రి 8 తర్వాత ఎలాంటి ప్రచారంలో పాల్గొనలేనని, అర్ధరాత్రి కార్యక్రమాలు వద్దని చెప్పారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో జరిగిన సమావేశంలో ఈ విషయం చెప్పినట్లు తెలుస్తోంది.