నేపాల్ లో శుక్రవారం బస్సు నదిలోకి దూసుకెళ్లిన ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 41కి చేరుకుంది. యూపీలోని గోరఖ్‌పూర్ కు చెందిన పర్యాటక బస్సులో 43 మంది నేపాల్ లోని పొఖారా నుంచి ఖాట్మాండుకు బయల్దేరారు. తనహు జిల్లాలోని అంబూ ఖైరేని ప్రాంతంలో వెళ్తుండగా వాహనం అదుపు తప్పి రహదారి పక్కన 150 అడుగుల లోతున వేగంగా ప్రవహిస్తున్న మార్సయాంగడీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 16 మంది అక్కడికక్కడే మృతి చెందగా..మరో 25 మంది చికిత్స పొందుతూ చనిపోయారు.