సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికతో కూడిన రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా జారీ చేసే కార్డులో ఎలక్ట్రానిక్ చిప్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో రేషన్‌కార్డుల దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది.